Thursday, 1 April 2021

సచివాలయంలో కోవిడ్19 టీకా అమలు - సూచనలు

 సచివాలయంలో కోవిడ్19 టీకా అమలు - సూచనలు 




1. సచివాలయంలో ప్రజలకు  CVC ( కోవిడ్ టీకా కేంద్రం)  ఏర్పాటు చేస్తున్న  సమాచారం ఒకరోజు ముందుగా టామ్ టామ్, మైక్ ప్రచారం,  పాంప్లేట్ ద్వారా తెలియజేయాలి.      

2. సచివాలయ CVC లో కనీసం మూడు కౌంటర్ లు ప్రజలకోసం ఏర్పాటు చేయాలి. ఈ కౌంటర్ లలో స్పాట్ రిజిస్ట్రేషన్, టీకా,  సర్టిఫికెట్ ఇచ్చే ఏర్పాటు ఉండాలి. 

3. సచివాలయంలో వాక్సిన్ అందిస్తున్న సమాచారం ప్రతి ఇంటా,  ప్రజలు అందరికీ  ANM, ఆశా కార్యకర్తలు ఒకరోజు ముందుగా  తెలియజేయాలి. 

4. స్థానిక ప్రజాప్రతినిధులకు, స్థానిక సంస్థలకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించాలి. ఇందుకు స్థానిక మెడికల్ ఆఫీసర్ గారు చొరవ చూపాలి. వీరిద్వారా అధిక శాతం ప్రజలు పాల్గొనేలా చూడాలి. 

5. గ్రామ వాలంటీర్ లు వారికి చెందిన 50 కుటుంబాలలో 45 సం. దాటిన వారిని అందరికీ వాక్సిన్ అందించే భాద్యత తీసుకోవాలి. ఈ చర్య ద్వారా వారి ప్రాంతాల్లో కోవిడ్ నుంచి రక్షణ కల్పించాలి. 

6. ఒకసారి నిర్వహించిన అనంతరం అదే సచివాలయంలో మరలా తిరిగి టీకా కార్యక్రమం నిర్వహిడం జరగదు కావున 100% లక్షిత వర్గాల ప్రజలు హాజరు అయ్యేలా చూడాలి. 

7. ఈ టీకా కార్యక్రమంలో 100% భాగస్వామ్యం వహించడం ద్వారా సంబంధించిన సచివాలయం ప్రజలు కోవిడ్ బారినుండి సంపూర్ణ రక్షణ పొందవచ్చు అన్న అవగాహనతో అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలి. 


State Command Control Centre, 

HMFW Department. A.P.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top