Saturday, 10 July 2021

"కామ్రేడ్” అంటే ఏమిటి ?

 "కామ్రేడ్” అంటే ఏమిటి ?




   మనం ఈ పదాన్ని ఏ యే సందర్భాలలో, ఎందుకు ఉపయోగిస్తున్నాం? అని ప్రశ్నించి విప్లవాత్మక పోరాటాలలో కామ్రేడ్ భావనకు ఒక ప్రత్యేక అర్థం, ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. మనకు తరచుగా వినబడే అమ్మ,నాన్న,అక్క,తమ్ముడు,అత్త,మామా లాంటి బంధువుల తాలూకు పిలుపులు,ఇంకా ఎన్నో నిత్య జీవితంలో వాడే పదాల్లాంటిది కాదు ఈ కామ్రేడ్ పదం. కొత్తగా యూనియన్ల లోకీ, ఉద్యమాల్లోకీ, విప్లవ సంస్థల్లోకీ వచ్చేవారు ఈ పదం విశిష్టత గురించి వివరించి చెప్పమని అనుభవజ్ఞులైన పెద్దలను అడుగుతుంటారు.

   "సమానత్వ సంస్కృతి మీద ఆధారపడి ఒక నూతన సమాజాన్ని నిర్మించాలని ఆశించే" వారందరూ ఒక గుంపుగా ప్రత్యేకమైన సంబంధాలు కలిగి ఉంటారు. వారు భౌతికంగా,మానసికంగా విప్లవాత్మక రూపాంతరం చెందుతున్న క్రమంలో ఎవరికివారు తమని తాము ప్రక్షాళన చేసుకుంటూ తమ భావజాలంతో ఏకీభవిస్తున్న తమతోటి సమూహాలలోని మనుషులను సంబోధించటానికి ఉపయోగించే పిలుపు”కామ్రేడ్”.

   కామ్రేడ్ అంటే ఒక వ్యక్తి. ఒక పురుషుడు కావచ్చు. ఒక స్త్రీ కావచ్చు. ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ రంగైనా, ఏ సంస్కృతి నుంచి వచ్చినవారైనా కావచ్చు. కానీ "అన్ని రకాల అసమానతలకూ అన్ని రకాల అణచివేతలకూ వ్యతిరేకంగా తోటి కార్మికులతో, సహచరులతో, శ్రామిక జనంతో భుజం భుజం కలిపి పోరాడే దృఢమైన మనస్తత్వం కలిగి ఉండాలి!" "వారే కామ్రేడ్"

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top