Wednesday, 29 June 2022

98' DSC అభ్యర్థులు ఇప్పుడేం పాఠాలు చెబుతారో...? విద్యాశాఖ మంత్రి బొత్స వ్యాఖ్యలు.

98' DSC అభ్యర్థులు ఇప్పుడేం పాఠాలు చెబుతారో...? విద్యాశాఖ మంత్రి బొత్స వ్యాఖ్యలు.
    


ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 98 డీఎస్సీ అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారాయి. ఇక ఉద్యోగం రాదని భావించి.. వివిధ వృత్తుల్లో స్థిరపడ్డ అభ్యర్థులు సీఎం జగన్ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేశారు.

తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అందరూ కలిసి వెళ్లి సీఎం జగన్ కు కృతజ్జతలు తెలిపారు. కాగా 98 డీఎస్సీ అభ్యర్థులపై తాజాగా బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బుధవారం చీపురుపల్లిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడుతూ.. ‘ 1998 డీఎస్సీ అభ్యర్థులను చూస్తే నాకు చాలా భయంగా ఉంది. వారు ఇప్పుడు వచ్చి ఏం పాఠాలు చెబుతారో అని ఆందోళనంగా ఉంది. వారంతా వివిధ వృత్తుల్లో స్థిరపడి ఉంటారు. వాళ్లకు మళ్లీ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.’ అంటూ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

బొత్స వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అయితే పలువురు విద్యావేత్తలు బొత్స వ్యాఖ్యలు సరైనవే అంటున్నారు. చాలా ఏళ్ల క్రితం డీఎస్సీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు కాబట్టి.. వారికి శిక్షణ ఇవ్వాల్సిన అభిప్రాయం ఉందని అంటున్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top