నేను 24 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నాను. డిపార్ట్మెంట్ టెస్ట్ లు పాస్ అయినాను. ప్రమోషన్ ఇస్తే నాకు తప్పకుండా SA గా ప్రమోషన్ వస్తుంది. నేను ప్రమోషన్ కు ముందు 24 సంవత్సరాల ఇంక్రిమెంట్ తీసుకోవడం మంచిదా లేక స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ తీసుకోవడం మంచిదా ? తెలియజేయగలరు. నాకు ఇంకా 9 సంవత్సరాల సర్వీస్ ఉన్నది.
మీరు 24 సంవత్సరాల స్కేల్ తీసుకొంటే SA పోస్ట్ లో FR22(B) వర్తించదు. అనగా మీకు ప్రమోషన్ కు ఒక ఇంక్రిమెంట్ వస్తుంది మరల SA కేడర్ లో 6 సంవత్సరాల స్కేలు రాదు.
మీరు 24 సంవత్సరాల స్కేల్ తీసుకోకుండా ఉంటే ప్రమోషన్ fixation లో FR22(B) వర్తిస్తుంది. అంటే ప్రమోషన్ తేదీ న ఒక ఇంక్రిమెంట్, ఇంక్రిమెంట్ తేదీ న నోషనల్ గా మరొక ఇంక్రిమెంట్ మరియు AGI ఇంక్రిమెంట్ వస్తుంది. SA కేడర్ లో 6 సంవత్సరాల ఇంక్రిమెంట్ వస్తుంది.

0 Post a Comment:
Post a Comment