Monday, 1 August 2022

ITR ఫైల్‌ చేయడం వల్ల ప్రయోజనాలు

ITR ఫైల్‌ చేయడం వల్ల  ప్రయోజనాలు



బ్యాంకు రుణం సౌలభ్యం :

మీరు సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

దేశంలోని అన్ని బ్యాంకులు పన్ను రిటర్న్ కాపీ గురించి అడుగుతాయి. ITR సహాయంతో బ్యాంకుల్లో రుణాలు పొందడం సులభం అవుతుంది. గృహ రుణాలు, వాహనరుణాలు పొందడంలో సులభతరం అవుతుంది.

వీసా పొందడానికి :

వీసా దరఖాస్తు సమయంలో చాలా మంది ఎంబసీలు, కాన్సులేట్‌లు గత రెండేళ్లుగా ప్రయాణికుల ITR కాపీని సమర్పించాలని కోరుతున్నారు. డాక్యుమెంటేషన్ పూర్తి అయినట్లయితే ఇది అప్లికేషన్ ప్రాసెస్‌ను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.

నష్టాలను తగ్గిస్తుంది :

ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం. ఐటీఆర్‌ ఫైల్‌ చేసేవారికి గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభంతో భర్తీ చేయవచ్చు. మీరు మీ ITR ను సకాలంలో ఫైల్ చేసినట్లయితేనే ఈ ప్రయోజనం పొందవచ్చు. IT చట్టం ప్రకారం.. మీరు మీ బకాయి ఖర్చులను వచ్చే సంవత్సరానికి కూడా ఐటీఆర్‌లో నమోదు చేసుకోవచ్చు.

జరిమానాలు నివారించడానికి :

 ఐటీఆర్ సకాలంలో దాఖలు చేయకపోతే ఆ వ్యక్తిపై ఐదు వేల రూపాయల వరకు జరిమానా చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. ఇది కాకుండా, వ్యక్తి సమయానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తే, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీపై బ్యాంకులు తగ్గించిన TDS తిరిగి పొందవచ్చు.

చిరునామా రుజువుగా :

 ITR చిరునామా, ఆదాయ రుజువుగా కూడా ఉపయోగించవచ్చు. అలాగే సభ్యత్వం మొదలైన వాటి కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top