Monday, 16 December 2024

 *📡సర్వీసు రిజిష్టరు లేకపోతే ఏమి చేయాలి?_🅰️✍️*

    STU DURGI Service Matter

*💥సర్వీసు రిజిష్టము పోయిన / జాడ తెలియని సందర్భాలలో పునర్నిర్మాణం ఎలా చేయాలి? (What to do when SR is lost/Net Traceable How to Re-construct it?)*

- సర్వీసు రిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు చేసిన విషయాల ఆధారంగానే ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత రావలసిన అన్ని రకముల ఆర్థిక సౌలభ్యాలు పొందు అవకాశం ఉంది. అట్టి అత్యంతప్రాముఖ్యత కలిగిన సర్వీసు రిజిష్టరు ఏ కారణం చేతమైన పోగొట్టుకొని పోయిన, లేక కనిపించకపోయినా, లేక అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయినా, అట్టి సర్వీసు రిజిష్టరు మరల ఎలా పునర్నిర్మాణం (Rebuilt or Reconstruction) F&P (FW.PS(1) department dated 11.6.1980 GO.Ms. No.202 చేసింది పై ఉత్తర్వులలో  తెలియజేసిన విధంగ సర్వీసు రిజిష్టరు పునర్నిర్మాణం చేయు సందర్భాలలో ఈ కింద పొందుపరిచిన అంశాలు కూడ పరిగణనలోనికి తీసుకోవాలి.

i) ఉద్యోగి నిర్వహించుకొనుచున్న (Maintain), నకలు (Duplicate) సర్వీసు రిజిష్టరులో నమోదు చేయబడి Attest చేసిన విషయాలు ఎంతవరకు నిజం అను విషయము సంబంధిత రికార్డులతోను, పేబిల్స్, వేతన స్థిరీకరణ పత్రములు; GIS,APGLI పదోన్నతికి సంబంధించిన సూచికలు, ఉద్యోగితో పాటు సహచర ఉద్యోగుల విషయములో జారీ చేసిన సామూహిక ఉత్తర్వులు, శాఖాధిపతి వారీ చేసిన ఉత్తర్వుల తదితర అంశాలపై అందుబాటులో వున్న సమాచారం ఆధారంగా సర్వీసు రిజిస్టరు పునర్నిర్మాణం చేయవచ్చు.

ii) ఈ విషయంలో నకలు (Duplicate SR) రిజిస్టరు చట్టబద్ధమైనదిగ పరిగణించబడదు.

iii) అదే విధంగా ఉద్యోగి తన సర్వీసు విషయాలను గురించి ప్రమాణ పూర్వకంగా సంతకం చేసి రాసి యిచ్చిన వాంగ్మూలం (Affidavit as at- పరిశీలించి, అట్టి విషయాలు సమాంతర (Collateral) ఉద్యోగుల సాక్ష్యాధారాలు ఉన్న పక్షమున అంగీకరించి పునర్నిర్మాణం  చేయవచ్చు.. (GO.Ms.No.224 F&P (FW.Pen.I) dept dated 28.8.1982).

iv) ఉద్యోగి అందజేసిన సాక్ష్యాధారాలు పరిశీలించి రికార్డు చేయాలి. ఎస్ టి యు దుర్గి

v) ఉద్యోగ నిర్వహించుకొని యున్న నకలు సర్వీసు రిజిష్టరులోని అటెస్టు చేయబడి నమోదు చేసియున్న విషయాలను దృవీకరించుకొని కొత్తగా సర్వీసు రికార్డు చేయాలి. (GOMs.No.216 GAD dated 22.6.1964)

vi) పుట్టిన తేది, ఉద్యోగ నియామకం, తదితర అంశాలకు సంబంధించి ఉద్యోగి చెంతనున్న వాటి ఆధారంగ విషయాలు నమోదు చేయవచ్చు. అదే విధంగా కార్యాలయంలోనూ, పై అధికారుల కార్యాలయంలోనూ అందుకు సంబంధించిన కాపీలు ఆధారంగా విషయాలు నమోదు. చేయవచ్చు. STU దుర్గి

vii) ఇంక్రిమెంటు రిజిష్టరు కార్యాలయంలో నిర్వహించియున్న యెడల. అట్టి రిజిష్టరు ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.

viii) పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఉద్యోగికి సంబంధించిన వాటిపై విద్యాశాఖవారు జారీ చేసిన సర్టిఫికెట్టు ఆధారంగా పరిచూచి సర్వీసు జిష్టరులో నమోదు చేయవచ్చు. అదే విధంగా ఉద్యోగం కోసం సర్వీసు కమీషన్ వారికి అభ్యర్థి పెట్టుకొన్న దరఖాస్తు ఆధారంగా కూడ సరిచూచుకోనవచ్చు.

ix) ఉద్యోగకి సంబంధించిన సర్వీసు వివరములు కొంతకాలం మేరకు తెలుసుకొనుటకు అవకాశం లేని పక్షమున, శాఖాధిపతి ఉద్యోగి అట్టి కాలంలో సర్వీసులో ఉన్నాడనిని, సస్పెన్షనులో లేదని, అదే విధంగ (ES- tra ordinary Leave)లో లేదని ఒక సర్టిఫికేటు జారీ చేయవచ్చు. కాని అట్టి సర్టిఫికెలు సాక్ష్యాధారములతో కూడిన వాడి మూలాంశములపై ఆధారితముగ ఉండవలెను.

x) శాఖాపర పరీక్షలు పాస్ అయిన వివరములు సర్వీసు కమిషన్ వారు ప్రచురించే ఉద్యోగ సమాచార్ పత్రిక నుంచి గాని లేక గెజెట్ ద్వారా గాని ధృవీకరించుకొనవచ్చు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top