DSC 2025 ద్వారా ప్రభుత్వ ఉద్యోగిగా చేరిన నాటినుండీ మీకు జీతభత్యాలు ఇవ్వడానికి కావలసిన దరఖాస్తుల వివరాలు
DSC 2025 ద్వారా ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగిగా చేరిన నాటినుండీ మీకు జీతభత్యాలు ఇవ్వడానికి కొన్ని దరఖాస్తులు పూర్తి చేసి సంబంధిత DDO ల ద్వారా సంబంధిత అధికారులకు పంపుతారు. ఆ వివరాలు...
1. HRMS ID / CFMS ID
✅ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ జీతం ఖజానా శాఖ ద్వారా పొందుతారు.
✅ ఆ క్రమంలో ప్రతి ఉద్యోగికి ఖజానా శాఖ వారు HRMS ID మరియు CFMS ID కేటాయిస్తారు.
✅ ఈ నంబర్ ద్వారా మాత్రమే జీతం మంజూరు చేయబడుతుంది.
✅ అందువలన ఇది అత్యవసరం.
2. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఇచ్చే సమయంలో ఆ జీతం నుండి ప్రభుత్వ తగ్గింపులు ఉంటాయి.
✅ వీటిలో ముఖ్యమైనది CPS.
✅ CPS అంటే Contributory Pension Scheme.
✅ ఉద్యోగి రిటైర్ అయ్యాక పెన్షన్ ఇవ్వడానికి PRAN నంబర్ అత్యవసరం.
✅ జీతం నుండి దాచుకున్న డబ్బు నుండి లోన్ తీసుకోవాలన్నా కూడా PRAN నంబర్ అవసరం.
✅ PRAN నంబర్ కోసం దరఖాస్తు చేసి, ఆ దరఖాస్తును DDO గారి కవరింగ్ లెటర్తో సంబంధిత ట్రెజరీకి అందజేయాలి.
✅ ట్రెజరీ అధికారుల కవరింగ్ లెటర్ ద్వారా PRAN Authorityకి పంపిన తర్వాత PRAN నంబర్ అలాట్ అవుతుంది.
3. ATTESTATION FORM
✅ ప్రభుత్వ ఉద్యోగి అనగా ప్రభుత్వంలో ఒక భాగం.
✅ ఉద్యోగి యొక్క గత చరిత్ర తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా చేసే ఎంక్వైరీనే ATTESTATION FORM అంటారు.
✅ ఈ దరఖాస్తుతో పాటు SSC, Intermediate, Degree, B.Ed/D.Ed, PG మొదలైన విద్యార్హతల మూడు సెట్స్ జెరాక్స్ కాపీలు గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించి ఇవ్వాలి.
✅ ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయిని ఒకే జిల్లాలో చదివితే 3 సెట్స్, రెండు జిల్లాలైతే 6 సెట్స్, మూడు జిల్లాలైతే 9 సెట్స్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి.
✅ ఈ దరఖాస్తు DDO ద్వారా DEO కార్యాలయానికి, అక్కడి నుంచి SP ఆఫీస్‌కి వెళ్తుంది.
✅ ఇంటెలిజెన్స్ వారు మన ఇంటికి, అలాగే మనం ట్యాగ్ చేయబడిన పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వివరాలు సేకరించి రిపోర్ట్ ఇస్తారు.
✅ ఆ రిపోర్ట్ ఆధారంగా Antecedents Verification Certificate జారీ అవుతుంది.
✅ ఈ సర్టిఫికేట్ ద్వారా Service Regularization కు దరఖాస్తు చేసుకోవాలి.
4. SERVICE REGISTER (SR)
✅ ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి, పదవీవిరమణ చేసేంతవరకు, చేసిన తరువాత కూడా ఉద్యోగి యొక్క వ్యక్తిగత, వృత్తి, జీతభత్యాల వివరాలు నమోదు చేసే పుస్తకమే SR (Service Register).
✅ ప్రతి ఉపాధ్యాయుడు తన SR ను మీ DDOకి అందచేయాలి.
SGT అయితే → MEO గారికి,
SA అయితే → GHM గారికి,
TGT, PGT అయితే ప్రిన్సిపాల్ గారికి,
✅ పై పేర్కొన్న అన్ని దరఖాస్తులు సరిగా పూర్తిచేసి, వాటితో పాటు మీ SR కూడా మీ DDO గారికి అందజేయాలి.
✅ మీకు HRMS ID/CFMS ID కేటాయించిన తరువాతే జీతం వస్తుంది.
✅ HRMS / PRAN రావడానికి సుమారు ఒక నెల సమయం పడుతుంది, కాబట్టి ఆ కాలానికి సిద్ధంగా ఉండాలి.
.jpeg)
0 Post a Comment:
Post a Comment