దివ్యాంగులకు స్కాలర్షిప్పులు. ఎన్ఎస్పీ పోర్టల్ దరఖాస్తుల స్వీకరణ - ఈనెలాఖరు వరకు గడువు.
దివ్యాంగ విద్యార్థుల విద్యకు కేంద్రం ఊతమందిస్తోంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని దివ్యాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తూ వారి విద్యాభివృద్ధికి తోడ్పడు తోంది. వివిధ కేటగిరీల వారీగా వారికి ఆర్థిక సాయాన్ని అందజేస్తూ ఆదుకుంటోంది. తరగతుల వారీగా ఈ ఉపకార వేతనాలను అందజేస్తోంది. 9, 10 తరగతులు, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే దివ్యాంగ విద్యార్థులకు ఈ పథకంతో ప్రయోజనం కలుగనుంది. సాధారణ వైకల్యం ఉన్న వారికి ఏడాదికి రూ.9 వేలు, మనో వైకల్యంతో బాధపడే వారికి రూ.11 వేలు, దృష్టి లోపం ఉన్న బాధితులకు రూ.12,400 లు, కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినులకు రూ. 14,600 చొప్పున ఆర్థికసాయం అందిస్తోంది.
ఈనెలాఖరు వరకు గడువు
ఈ స్కాలర్షిప్ల కోసం ఎన్ఎస్పీ పోర్టల్లో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్, ఫోన్ నంబర్ అనుసంధానించబడిన బ్యాంకు ఖాతాతో దర ఖాస్తు చేసు కోవాల్సి ఉంటుంది. జూన్ 25న ప్రారం భమైన ఉపకార వేతనాల పథకానికి దరఖాస్తుకు తుది గడవు అక్టోబరు 31. నవంబరు 30లోగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేస్తారు. ఉపకార వేత నాలను ఎంపికైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
దివ్యాంగ సంక్షేమ శాఖ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్థులను గుర్తించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకొనేలా ప్రొత్సహిస్తోంది. 18 ఏళ్ల లోపు వారిని గుర్తించి వారికి అవసరమైన ఉపకరణాలు, ఉపకార వేతనాలు పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు వారి అవసరాన్ని బట్టి ఎస్కార్ట్, రవాణా, రీడర్ అలవెన్సు, బాలికల సైఫండ్, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ రూ.6 వేలు చొప్పు న అందజేసేందుకు కూడా జిల్లాల్లోని ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. దివ్యాంగ విద్యార్థులకు ఎంత గానో ఉపయోగపడే ఉపకార వేతనాలను పొందేందుకు అర్హులంతా దరఖాస్తు చేసు కోవాలని ఆ శాఖాధికారులు కోరుతున్నారు.
.jpeg)
0 Post a Comment:
Post a Comment