NMMS ఉపకార వేతన పరీక్షకు యాప్ తో ఉచిత శిక్షణ
జాతీయ ప్రతిభా ఉపకార వేతన (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యా యులు 'తెలుగు ఎగ్జామ్స్' యాప్ ద్వారా ఉచిత శిక్షణను అందుబాటు లోకి తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పనిచే స్తున్న 12 మంది ఉపాధ్యాయుల బృందం ఆధ్వర్యంలో నమూనా పరీక్ష పేపర్లు, సజ్జెక్టుల అధ్యయన ప్రణాళిక, ఇతర సమాచారాన్ని ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. అక్టోబరు11 నుంచి నవంబరు 25వ తేదీ వరకు షెడ్యూలు ప్రకారం శిక్షణ, నమూనా పరీక్షలు ఉంటాయి. ఈ యాప్ను అమరావతిలో ఏపీ ఎస్ఆర్టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి ఇటీవల ఆవిష్కరించారు.
గూగుల్ ప్లేస్టోర్ telugu exams అని టైపు చేసి ఈ యాప్ను చరవాణిలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. మొబైల్ సంఖ్య, ఈ-మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అయి సిలబస్, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. పేద విద్యా ర్థుల కోసం ఈ శిక్షణను ఉచితంగా అందుబాట లోకి తెచ్చామని.. పరీక్షలు పూర్తయ్యే వరకు సిలబస్, ఇతర సమాచారాన్ని నవీకరిస్తూ ఉంటామని మొగల్తూరుకు చెందిన ఉపాధ్యా యుడు పంపన శ్రీనివాసరావు తెలిపారు. పూర్తి వివరాలను భీమవరానికి చెందిన ఉపాధ్యా యుడు వీరవల్లి వెంకటేశ్వరరావును (95333 34463) సంప్రదించవచ్చన్నారు.

0 Post a Comment:
Post a Comment