Sunday, 27 September 2026

మహిళా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయినీలకు మొత్తం సెలవుల వివరాలు

మహిళా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయినీలకు మొత్తం సెలవుల వివరాలు


మహిళా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయినీలకు ఇప్పటి వరకు సంఘాల ప్రాతినిధ్యం ఫలితంగా క్రింద తెలిపిన సెలవులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు CLS, Special CLS (15 + 7) వంటి సెలవులు మరియు క్రింద వివరించిన ప్రత్యేక సెలవులు కూడా ఉన్నాయి.
మహిళా ఉద్యోగులకు లభించే ప్రత్యేక సెలవులు
1
ప్రసూతి సెలవులు : 180 రోజులు
G.O. Ms. No. 152, తేదీ: 04-05-2010
2
అబార్షన్ సెలవులు : 42 రోజులు
G.O. Ms. No. 762, తేదీ: 11-08-1976
3
ట్యూబెక్టమీ ఆపరేషన్ సెలవులు : 14 రోజులు
G.O. Ms. No. 1415, తేదీ: 10-06-1968
4
రీకానలైజేషన్ ఆపరేషన్ సెలవులు : 21 రోజులు
G.O. Ms. No. 102, తేదీ: 19-02-1981
5
గర్భనిరోధక సాధనం (లూప్) అమర్చుటకు : 01 రోజు
G.O. Ms. No. 128, తేదీ: 13-04-1982
6
గర్భసంచి తొలగింపు / హిస్టరెక్టమీ ఆపరేషన్ : 45 రోజులు
G.O. Ms. No. 52, తేదీ: 01-04-2011
7
మహిళా దినోత్సవం : 01 రోజు
G.O. Ms. No. 433, తేదీ: 04-08-2010
8
ప్రత్యేక CLS : 05 రోజులు
G.O. Ms. No. 374, తేదీ: 16-03-1996
శిశు సంరక్షణ సెలవులు (Child Care Leave - CCL)
పై విధంగా ప్రత్యేక సెలవులతో పాటు 10వ పి.ఆర్.సి. ప్రతిపాదనలకు అనుగుణంగా సర్వీసు మొత్తంలో పిల్లల సంరక్షణ నిమిత్తం, పాఠశాల, కళాశాల స్థాయి పరీక్షల సమయంలోనూ, అనారోగ్యం వగైరా కారణాల కోసం 3 నెలలు (180 రోజులు) వరకు శిశు సంరక్షణ సెలవులు నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సదుపాయం మహిళా ఉద్యోగులకు ఒక వరంగా భావించవచ్చు.
1
ఈ సెలవును 6 సార్లకు తగ్గకుండా ఇద్దరి పిల్లల వయస్సు 18 సంవత్సరాల వరకు వినియోగించుకోవచ్చు. అశక్తులైన పిల్లలు (మానసిక / శారీరక / వికలాంగుల) విషయంలో 22 సంవత్సరాలు నిండేవరకు ఎన్నిసార్లు అయినా వినియోగించుకోవచ్చు.
2
ఈ సెలవును LTC నిమిత్తం వాడుకోవడానికి వీలులేదు. ఈ సెలవులు వినియోగించుకున్న వివరాలను సంబంధిత GOలో పొందుపరిచిన ప్రొఫార్మా ప్రకారం ELs మరియు Half Pay Leave ఖాతాల మాదిరిగా సర్వీస్ రిజిస్టరులో నమోదు చేయాలి.
3
ఈ సెలవులు ELs మరియు Half Pay Leave ఖాతా నుండి తగ్గించబడవు.
4
ఈ సెలవును వినియోగించుకోవడం హక్కుగా భావించరాదు.
5
మంజూరు చేయు అధికారి నుండి ముందస్తు అనుమతి పొంది మాత్రమే సెలవుపై వెళ్లాలి.
6
ఈ సెలవును కార్యాలయం / సంస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకోవాలి.
7
ఈ సెలవును సంపాదిత సెలవుగా పరిగణించాలి.
8
ఈ సెలవులను ప్రసూతి సెలవులు మరియు ఇతర సెలవులతో కలుపుకుని, అనగా CLs, Special CLs కాకుండా వినియోగించుకోవచ్చు.
9
ఈ సెలవును కనిష్ఠంగా ఒక్కరోజు కూడా CCLగా మంజూరు చేయవచ్చు. అయితే ఒక విడతలో 15 రోజులు మించకూడదు.
10
మొదటి విడత CCL మంజూరు సమయంలో పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్లు దరఖాస్తుకు జతపరచాలి. ఇతర ఏ రకమైన సర్టిఫికెట్లు అవసరం లేదు.
11
ఆకస్మికేతర సెలవు (OCL)కు వర్తించే Prefix / Suffix నిబంధనలు ఈ సెలవుకు కూడా వర్తిస్తాయి.
12
శిశు సంరక్షణ సెలవు ప్రారంభానికి ముందురోజు పొందిన వేతనాన్ని సెలవు కాలానికి చెల్లిస్తారు. సెలవు కాలంలో ఇంక్రిమెంట్ మంజూరు చేయరు.
13
నిబంధనలకు విరుద్ధంగా వేతనాన్ని మినహాయించడం చేయరాదు.
ముఖ్యమైన గమనిక
మహిళా ఉద్యోగుల / టీచర్ల పిల్లలు పూర్తిగా వారి మీద ఆధారపడి, వారితో కలిసి నివసిస్తున్న సందర్భంలోనే CCL మంజూరు చేయబడుతుంది.

0 Post a Comment:

Post a Comment

LATEST INFO

  • Loading posts...
More posts →

Teacher's Need

Frequently Asked Questions(FAQs)

  • Loading posts...
More posts →

LEAVE RULES

  • Loading posts...
More posts →

TEACHER TOOLS

  • Loading posts...
More posts →

MID DAY MEAL(MDM)

  • Loading posts...
More posts →

Application Forms

  • Loading posts...
More posts →

TET/DSC

  • Loading posts...
More posts →
Top