*🌷సందేహం--సమాధానం*
ప్రశ్న:
CCL ఎలా వాడుకోవాలి??
జవాబు:
MEO/HM ప్రొసీడింగ్స్ ఇచ్చిన రోజు నుండి 6 నెలల లోపు వాడుకోవాలి. అంతేగాని CCL పెట్టిన రోజు నుండి 6 నెలల లోపు కాదు.
☘
ప్రశ్న:
ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)లో నుంచి మన అత్యవసరాలకు దాచుకున్న మొత్తంలో కొంత వెనక్కి లేదా అప్పుగా తీసుకవచ్చు కదా! జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్)లో ఇలా తీసు కోవడం వీలవుతుందా? పదవీ విరమణ, అత్యవసరాలకు సంబంధించి ఈ రెండింటిలో ఏది మెరుగైనది??
జవాబు:
దీర్ఘకాలిక అవసరాల కంటే తక్షణ అవసరాలు, కోరికలు, కలల కోసం ఖర్చు పెట్టాలని చూడటం మానవ బలహీనత. పదవీ విరమణ చేశాక పింఛను అత్యవసరం. పింఛను కోసం మొదలు పెట్టిన దీర్ఘకాలిక పొదుపు, పెట్టుబడులను మధ్యలో తీసుకోకూడదనే లక్ష్యంతో ఎన్‌పీఎస్ టైర్ 1 ఖాతాలో మొత్తాన్ని మధ్యలో వెనక్కి తీసుకోకూడదనే నిబంధన విధించారు. ఇటీవల దీన్ని కొంత సడలించారు. పిల్లల చదువు, పెళ్లి, ఇంటి నిర్మాణం, గుండెపోటు, పక్షవాతం, ప్రమాదం వంటి ఆరోగ్య అవసరాలకు మన ఎన్‌పీఎస్ నిల్వలో 25శాతం వెనక్కి తీసుకోవచ్చు.ఎన్‌పీఎస్ ప్రారంభించిన మూడేళ్ల తర్వాత ఈ సదుపాయం లభిస్తుంది. పదవీ విరమణ చేసేలోగా మూడుసార్లు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. పీపీఎఫ్‌లో వడ్డీ జనవరి నుంచి 7.6శాతం. ఎన్‌పీఎస్ టైర్-1 ఈక్విటీలో గత ఐదేళ్ల రాబడి 14శాతం వరకూ ఉంది.ఇందులో ప్రభుత్వ బాండ్ పథకంలో కూడా రాబడి 8.47% పైగానే ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 పెట్టుబడి పెట్టి, అదనంగా మరో రూ.50వేల పెట్టుబడి వరకూ ఎన్‌పీఎస్‌లో మదుపు చేసి, ఆదాయపు పన్ను రాయితీ పొందవచ్చు. కాబట్టి, మీరు ఎన్‌పీఎస్ ఎంచుకోవచ్చు.
ప్రశ్న:
ఒక టీచర్ 9 రోజులు APOSS పరీక్షల కోసం, మరియు 26 రోజులు SSC అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం వేసవి సెలవులలో హాజరు అయ్యాడు.ఇపుడు ఆతనికి 35 ELs జమచేయబడతాయా??
జవాబు:
మొత్తం కాలాన్ని కలిపి దామాషా ELs జమ చేయవలసి ఉంటుంది. ప్రతి సంవత్సరం జమ అయ్యే 6 రోజులు మీరు వినియోగించుకున్న వేసవి సెలవులు 15 రోజుల కంటే తగ్గిన యెడల పూర్తి సంపాధిత సెలవు 24 రోజులు జమ చేయబడుతుంది.ఇక్కడ 35 రోజులు పనిచేశాడు.14 రోజులే వేసవి సెలవులు ఉపయోగించుకొన్నందున అతనికి 24 రోజుల సంపాధిత సెలవు జమచేయవలసి ఉంటుంద
0 Post a Comment:
Post a Comment