ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ నిర్వహణ – నియమాలు, పద్దతులు.
1) స్థానిక సెలవులు (03) అకాడమిక్ సంవత్సరం ప్రకారం ఉంటాయి, కావున ఈ రిజిష్టర్ లో గత ఏడాది రిజిష్టర్ లో ఎన్ని తీసుకున్నారు, ఏ తేదీలలో తీసుకున్నారు, సందర్భం తో సహా ఇంకా ఎన్ని మిగిలాయి వాలిడిటి ఎప్పటి వరకు ఉంది అనే వివరాలను ప్రస్తుత రిజిష్టర్ లో ని మొదటి పేజీ లో (జనవరి నెలలో) తప్పకుండా నమోదు చేయాలి
2) ఆప్షన్ సెలవులు క్యాలెండర్ సంవత్సరం ప్రకారం నిర్ణయించబడతాయి కావున వీటిని కూడా తేదీలతో సహా ప్రొసీడింగ్స్ నంబర్ తో నమోదు చేసి ప్రధానోపాధ్యాయులు స్టాంప్ తో సైన్ చేయాలి.
3) సిబ్బంది ఎవరైనా సెలవులు పెట్టితే ఆ సెలవు పత్రాలు సాధ్యంమైన వరకు రిజిష్టర్ వెనుక భాగాన పిన్ చేసి ట్యాగ్ తో కట్టాలి లేదా ప్రత్యేకంగా ఫైల్ లో భద్ర పరచాలి. వీటికి ప్రధానోపాధ్యాయులు బాధ్యులు.
4) ఉద్యోగులు తమ హాజరు పట్టి తమ పేరుకు ఎదురుగా బ్లూ, బ్లాక్ పెన్ తోనే సంతకం చేయాలి. రెడ్ పెన్ గాని గ్రీన్ పెన్ గాని వాడొద్దు.
5) రిజిష్టర్ లో సీనియారిటీ ప్రకారం వరుసలో ఉద్యోగుల పేర్లు రాయాలి. అందరి తర్వాత చివరన మొదటి సీనియర్ లేదా ప్రధానోపాధ్యాయులు పేరు ఉంచి ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం గెజిటెడ్ అధికారులు గ్రీన్ పెన్ తో నాన్ గెజిటెడ్ అధికారులు రెడ్ పెన్ సంతకం చేయాలి.
6) ఉద్యోగులు హాజరు రిజిష్టర్ యందు క్లుప్త సంతకాలు కాకుండా పూర్తి సంతకాలు పెట్టాలి , ఒక వేళ పట్టక పోతే చిన్నగా రాయాలి .
7) ఉద్యోగులు ఎవరైనా OD లో వెళ్ళినట్లైతే ఏ పని మీద వెళ్లారు, ఇక్కడికి వెళ్లారో ఆ వివరాలను ఆ తేదీ నాడు ఆయన సంతకం చేయవలసిన ప్రదేశం లో రాయాలి. సంబంధిత అటెండెన్స్ సర్టిఫికెట్ లను సెలవు పత్రాలు భద్ర పరచి న చోట ఉంచాలి.
8) ఉన్నత అధికారులు సందర్శించినప్పుడు , హాజరు రిజిష్టర్ లో సంతకం చేయాలి అని అనుకున్నప్పుడు , ఆ రోజు నాటి వరుసలో ప్రధానోపాధ్యాయులు వారి సంతకం క్రింద చేయాలి.
9) స్థానిక సెలవులు మరియు ఆప్షన్ సెలవులు తీసుకున్నపుడు హాజరు రిజిష్టర్ లో ఆ రోజు వరుసలో సందర్భం పేరు , అది ఏ రకమైన సెలవు మరియు ఎన్నవ సెలవు (వరుస నంబరు వేయాలి) వివరాలు రెడ్ పెన్ తో రాయాలి.
10) రిజిష్టర్ లో ముందస్తు గా సెలవు లు రాయకూడదు. ఉదా ఆదివారం, రెండవ శనివారం...
11) రిజిష్టర్ లో కొట్టివేతలు ఉండకూడదు. వైట్నర్ వాడకూడదు. అనివార్య కారణాల వల్ల కొట్టివేత చేయవలసి వచ్చినప్పుడు ఒక గీత గీసి పైన రాయాలి దీనిని క్రింద సర్టిఫై చేస్తూ ప్రధానోపాధ్యాయులు సంతకం చేయాలి.
12) హాజరు రిజిష్టర్ లో జెల్ పెన్నులు గాని ఇంక్ పెన్నులు గాని స్కెచ్ పెన్నులు గాని వాడకూడదు. బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే వాడాలి.
13) ప్రతి నెల పేజీ లో పైన వద్ద పాఠశాల స్టాంప్ (గుండ్రటి స్టాంప్ కాదు) తప్పకుండా వేయాలి.
14) అనివార్య కారణాల వల్ల సంతకం చేసిన చోట చిరిగినట్లైతే సెల్లో టేప్ తో అతికించాలి.
15) రిజిష్టర్ లో ముందస్తు సంతకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు, ఒక వేళ చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవు.
16) ఉద్యోగులు ఎవరైనా సెలవులు పెట్టినట్లైతె ఆ సెలవు రకము ను ఖచ్చితంగా రాయాలి.
ఉదా : CL, CCL, Sp CL వగైరా
17) కాంట్రాక్ట్ బేసిస్ లో ఎవరైనా ( MDM కుక్స్, విద్యా వాలెంటిర్లు, స్కావెంజర్ లు, వాచ్ మెన్ లు, వగైరాలు ) పని చేస్తూ ఉన్నట్లైతే వారికి ప్రత్యేకంగా వేరే రిజిష్టర్ పెట్టాలి మరియు ప్రతి రోజూ వారి సంతకాలు తీసుకోవాలి. దీని లో అందరి తర్వాత చివరన ప్రధానోపాధ్యాయులు పేరు రాసి రోజు రెండు పూటలా సంతకం చేయాలి . ఒక వేళ ప్రధానోపాధ్యాయులు సెలవులో ఉంటే ఇన్ ఛార్జ్ గారు సంతకం చేయాలి.
18) కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసే వారి పని కాలం అకాడమిక్ సంవత్సరం ప్రారంభం లో ప్రారంభమయి, అకాడమిక్ సంవత్సరం చివరి రోజున ముగుస్తుంది.వారు ఎన్ని సంవత్సరాలు పని చేసిన కూడా రిజిష్టర్ పై ప్రకారమే తేదీ లు రాయాలి.
19) మే నెలలో బడి నడవక పోయినప్పటికీ హాజరు రిజిష్టర్ లో ఖచ్చితంగా మే నెల రాసి అన్ని వివరాలు రాసి వేసవి సెలవులు అని రాయాలి.
20) ఒక వేళ రిజిష్టర్ లో ఒక సంవత్సరం పూర్తి అయిన తరువాత కూడా పేజీ లు మిగిలితే తరువాత సంవత్సరం కు కూడా అదే వాడవచ్చు కానీ ఖచ్చితంగా తర్వాత సంవత్సరం పూర్తి అయ్యేందుకు సరి పడా పేజీలు ఉండాలి.అనగా రిజిష్టర్ లో పూర్తి సంవత్సరం ఖచ్చితంగా ఉండాలి.ఒక సంవత్సరం నాకు రెండు రిజిష్టర్ లు ఉండకూడదు.ఒక సంవత్సరం నకు ఒక రిజిష్టర్ వాడడం ఉత్తమం.
21) ఉన్నత అధికారుల కోసం ఒక వరుస లో "ఉన్నత అధికారులు" అని గాని "సీనియర్ అఫిషియల్" అని గాని రాసి వదిలేయాలి. ఎవరైనా ఎపుడైనా అధికారులు వచ్చినప్పుడు వారు వచ్చిన రోజు ఈ బాక్స్ లో సంతకం చేయాలి
22) ఉద్యోగులకు మంజూరు చేయబడిన సి సి ఎల్ (CCL) లు , ఈ జనరల్ క్యాలెండర్ తో కాకుండా మంజూరీ చేయబడిన తేదీన నుండి ఆరు నెలల వాలిడిటి ఉంటుంది ( ఒక జనరల్ క్యాలెండర్ లో ఆరు మాత్రమే వాడుకోవాలి ) కావున ఉద్యుగులకు గత జనరల్ క్యాలెండర్ లో మంజూరీ చేయబడిన వాటి సీసీ ఎల్ ల వివరాలు అనగా మిగిలిన సి సి ఎల్ లు ప్రొసీడింగ్స్ నంబర్ తేదీ తో పాటు కొత్త రిజిష్టర్ లో మొదటి పేజీలో రాయాలి.
.jpeg)
0 Post a Comment:
Post a Comment