SSC నామినల్ రోల్స్ - ముఖ్య గమనిక
SSC నామినల్ రోల్‌లో చేర్చబడి, ఇప్పటికే UDISE+ పోర్టల్‌లో పరీక్ష వివరాలు ఫైనలైజ్ అయిన అభ్యర్థుల వివరాలను సవరించుటకు UDISE+ పోర్టల్‌లో “Edit Option” ప్రారంభించ బడినది అని అన్ని ప్రధానోపాధ్యాయులకు తెలియ జేయడమైనది. ఈ సదుపాయం ద్వారా ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా ఆరు (6) సార్లు మాత్రమే వివరాల సవరణకు అవకాశం కల్పించ బడుతుంది.
ఉదాహరణకు:
▪️ ఒక అభ్యర్థి మొదటి Edit Optionలో ఇప్పటికే మూడు (3) సవరణలు చేసినట్లయితే, తదుపరి Edit Optionsలో మిగిలిన మూడు (3) సార్లు మాత్రమే సవరణలు చేసుకునే అవకాశం ఉంటుంది.
▪️ ఆరు (6) సార్లు సవరణల అవకాశాన్ని పూర్తిగా వినియోగించిన అనంతరం, ఎట్టి పరిస్థితుల్లోనూ మరల సవరణలు చేయుటకు అవకాశం ఉండదు.
▪️ కావున, ఈ సదుపాయాన్ని అత్యంత జాగ్రత్తగా వినియోగించ వలసిందిగా పాఠశాలలకు సూచించడ మైనది.
▪️ Correction / Edit Option ద్వారా క్రింది వివరాలను మాత్రమే సవరించ వచ్చు:
• తండ్రి పేరు
• తల్లి పేరు
• కులం (Caste)
• ఉపకులం (Sub-Caste)
• ఫోటోగ్రాఫ్
• సంతకం (Signature)
• గుర్తింపు గుర్తులు (Identification Marks)
◾గమనిక:
▪️ Subjects మరియు CWSN Categoryలో ఎటువంటి సవరణలు చేయరాదు.
▪️ ఈ అంశాలలో ఏవైనా మార్పులు చేసినట్లయితే, సంబంధిత ప్రధానోపాధ్యాయుడే పూర్తి బాధ్యత వహించ వలసి ఉంటుంది. అలాగే, Subjects మరియు CWSN Categoryలో చేసిన సవరణలు పరిగణనలోకి తీసుకో బడవు.
▪️ అభ్యర్థి పేరు (Name) మరియు జన్మ తేదీ (Date of Birth) సవరణలు Aadhaar లో మాత్రమే చేయ వలసి ఉంటుంది (ఈ ఫీల్డ్స్‌కు సంబంధించిన Edit Option తరువాత ప్రారంభించ బడుతుంది).
▪️ Aadhaarలో సవరణ పూర్తైన తరువాత, 15 రోజుల అనంతరం ఆ వివరాలు UDISE+లో ప్రతిబింబిస్తాయి.
▪️ ఈ విషయమై, అందరు RJDSEలు, DEOలు, Dy. DEOలు మరియు ACGEs తమ పరిధిలోని అన్ని ప్రధానోపాధ్యాయులకు ఈ సమాచారం విస్తృతంగా తెలియజేసి, అవసరమైన సవరణలు చేయించ వలసిందిగా సూచించడ మైనది.
◾ఇంకా తెలియ జేయునది ఏమనగా...
UDISE+ పోర్టల్‌లో Edit Option ద్వారా చేసిన అన్ని సవరణలు స్వయంచాలకంగా BSE పోర్టల్‌లో కూడా ప్రతిబింబిస్తాయి.
◾Edit Option కాలవ్యవధి:
07.02.2026 నుండి 12.02.2026 వరకు మాత్రమే
.jpeg)
0 Post a Comment:
Post a Comment