❓ సందేహం :
ఒక ఉపాధ్యాయుని భార్య ప్రసవ సమయంలోనే ట్యూబెక్టమీ చేయించుకున్నారు. వారి భర్త ప్రసవ సమయంలో భార్య ట్యూబెక్టమీ చేయించున్నప్పుడు భర్తకు ఇచ్చే ప్రత్యేక సెలవు మరియు 6 నెలలోపు పెట్టు లీవు రెండూ వాడుకోవచ్చా? ఒకటే వాడుకోవాలని వారి హెచ్ఎం అభ్యంతరం పెడుతు ఉన్నారు. సమంజసమేనా?
✅ సమాధానం :
భార్య ట్యూబెక్టమీ చేయించుకున్నప్పుడు భార్యకు సహాయకుడిగా ఉండేందుకు ఉద్దేశించిన సెలవు, బిడ్డకు సంరక్షణగా ఉండేందుకు ఇచ్చిన పెటర్నిటీ లీవు వేరు వేరు. ట్యూబెక్టమీ ప్రత్యేక సెలవు ఆ సమయంలోనే వాడుకోవాలి. పెటర్నిటీ లీవు ప్రసవం జరిగిన 6 నెలలలోపు వాడుకోవచ్చు. కాబట్టి రెంటింటిని వేరువేరుగా పరిగణిస్తూ, రెంటింటిని వాడుకునే అవకాశం ఉపాధ్యాయునికి కలదు.

0 Post a Comment:
Post a Comment